ఓ వైపు చీరకట్టు, మరోవైపు పొట్టి బికినీ.. మోసం చేస్తున్న స్టార్ హీరోయిన్స్

మొదట కొన్ని సినిమాలతో హీరోగా టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నవదీప్ ప్రస్తుతం స్టార్స్ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ నెగిటివ్ సపోర్టింగ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధాంగా ఈ కుర్ర హీరో బాలీవుడ్ వైపు కూడా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఇక త్వరలోనే నవదీప్ సన్నీ లియెన్ తో రొమాన్స్ చేయనున్నాడట.  రాగిణి MMM వెబ్ సిరీస్ లో నవదీప్ ఒక ముఖ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు సౌత్ లో వైరల్ గా మారింది. సీజన్ 1 తో రాగిణి MMS మంచి సక్సెస్ టాక్ ని అందుకుంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ అడల్డ్ హారర్ సిరీస్ కి మరో సీక్వెల్ ని డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ కూడా రానుందట.

ఇక నవదీప్ ఈ సిరీస్ లో సన్నీ లియోన్ తో కలిసి రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ సిరీస్ తో నవదీప్ ఎంతవరకు క్లిక్ అవుతాడో చూడాలి.ప్రస్తుతం నవదీప్ అల్లు అర్జున్ 'అల..వైకుంఠపురములో..' నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నవదీప్ సరికొత్త ఫిట్నెస్ తో బన్నీతో ఫైట్ చేయనున్నాడు.