Asianet News TeluguAsianet News Telugu

క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు: హైపర్ ఆదికి హెచ్చరిక

తెలంగాణ సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పినప్పటికీ వదిలేది లేదని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకుడు నవీన్ గౌడ్ హెచ్చరించారు.

Telangana Jagruthi student wing leader not satisfied with Hyper Adi apology to Telangana people for his comments
Author
Hyderabad, First Published Jun 16, 2021, 7:27 AM IST

హైదరాబాద్: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ఓ టీవీలో ప్రసరమైన షోలో తెలంగాణ సంస్కృతిపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. హైపర్ ఆది క్షమాపణలు చెప్పినప్పటికీ వదిలేది లేదని తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన తర్ావత ఆ సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. 

హైపర్ ఆది క్షమాపణ చెప్పిన తీరు సరిగా లేదని ఆయన అన్నారు. ఆది తన పర్సనల్ పేజీలో వీడియో పోస్టు చేసి చేతులు దులుపుకునే్ ధోరణని సహించేది లేదని ఆయన అన్నారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా తెలుస్తున్నప్పటీకీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. 

హైపర్ ఆది ఇప్పటికి కూడా పశ్చాత్తాపపడకుండా కేవలం తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని నవీన్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలు యావత్తూ ఆ వ్యాఖ్యలను గమనిస్తున్నారని ఆయన అన్నారు సరైన సమయంలో సరైన బుద్ధి చెబుతామని నవీన్ గౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఆది క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, జబర్దస్త్ నటుడు హైపర్ ఆది దిగొచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బతుకమ్మ, గౌరవమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఆ క్షమాపణలు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ అనే తేడాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని, అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతామని ఆయన చెప్పారు. 

శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసి స్కిట్ మీద తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానిపై హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మంగళవారం ఉదయం దానిపై ఫోన్ కాల్ విద్యార్థి విభాగం ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.

ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదా వరకు కూడా తాము వదలిపెట్టబోమని, ఆవసరమైతే న్యాయపరంగా వెళ్తామని వారు హెచ్చరించారు.

ఆ హెచ్చరికలతో హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ మంగళవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని, అవి తాము కావాలని చేసినవి కావని హైపర్ ఆదిచెప్పారు. అన్ని ప్రాంతాల వారి ప్రమే, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు ఆయన తెలిపారు ఇటీవల షోలో జరిగినదానికి క్షమాపణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios