తెలంగాణ ప్రభుత్వం చిత్ర రంగానికి తగిన ప్రాధాన్యతనిస్తోంది. సినీ నిర్మాతలకు భరోసాగా నిలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ రేట్స్ హైక్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2కి కూడా రేట్స్ పెంచుతూ పర్మిషన్ ఇచ్చింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Government) సహకరిస్తోంది. ముఖ్యంగా టికెట్ల విషయంలో భారీ బడ్జెట్ సినిమాలను గమనంలో ఉంచుకుని ఎప్పటికప్పుడు హైక్స్ ఇస్తూ వచ్చారు. గతనెల మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి కూడా టికెట్స్ రేట్లు పెంచింది. ఏకంగా పది రోజుల పాటు టికెట్స్ రేట్స్ హైక్ చేస్తూ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో రూ. 413 వరకు, సింగిల్ థియేటర్ లో టికెట్ రేటు 236 రూపాయలుగా అమ్ముడుపోయాయి. మొత్తంగా తొలి 10 రోజులకు కనిష్టంగా రూ.106 ఉంటే, గరిష్టంగా రూ.380 ఉంది.
ఇక ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని నుంచి భారీ అంచనాలతో కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf Chapter 2) మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమాకు కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయం స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే సాధారణ టిక్కెట్ ధరపై మల్టీప్లెక్స్ లలో రూ.50, సింగిల్ థియేటర్లలో రూ.30 వరకు టికెట్ పై పెంచుకునే వీలు కల్పించింది. ఈ సౌకర్యం కేవలం నాలుగు రోజుల వరకే ఉంటుందని, తర్వాత సాధారణ రేట్స్ కే విక్రయించాలని తెలిపింది.
కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఈ గురువారం ( ఏప్రిల్ 14న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ భారీ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యష్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి (SriNidhi Shetty) ఆడిపాడుతోంది. సంజయ్ దత్ మరియు రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఛాప్టర్ 2లో రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
