రీసెంట్ గా నటి రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని విరాజ్ పేట్ లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు.

రష్మిక ఇంటి నుంచి ఐటీ అధికారులు లెక్కల్లో చూపని పాతిక లక్షల మొత్తం నగదు, అలానే రూ.3.94 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ కొన్ని ఆంగ్లపత్రికలలో కథనాలు వచ్చాయి.

రష్మిక ఇంటికి ఐటి నోటీసులు.. ఫైనల్ క్లారిటీ ఇచ్చిన మేనేజర్

రష్మిక, ఆమె తండ్రి మదన్ సోమవారం నాడు మైసూరులోని ఐటీశాఖ కార్యాలయానికి చేరుకొని పలు డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రష్మిక తండ్రి మదన.. ఐటీశాఖ అధికారులు కొన్ని పత్రాలు అడిగారని.. వాటిని అందజేయడానికే ఐటీ కార్యాలయాలనికి వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా రష్మిక.. మహేష్‌తో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దాంతో అందరి దృష్టి ఆమెపై పడింది. ఈ నేపధ్యంలో వస్తున్న ఈ వార్తలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

రష్మికకి అన్ని కోట్ల ఆస్తులా..? అంతా షాక్

ప్రస్తుతం రష్మిక.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక కనిపించనుంది.