Asianet News TeluguAsianet News Telugu

మా ఇంట్లో ఇంకెవరైనా ఉంటున్నారేమో..? తాప్సీ


‘‘ఏప్రిల్‌లో రూ. 4,390, మేలో రూ. 3,850 బిల్‌ వచ్చింది. జూన్‌కి రూ. 36,000 బిల్‌ పంపారు. గత నెల మా కరెంట్‌ బిల్‌ అంతలా పెరగడానికి మూడు నెలల లాక్‌డౌన్‌ కాలంలో నేను ఏమైనా కొత్త ఎలక్ట్రిక్‌ వస్తువులు కొన్నానా? ఎక్కువ వినియోగించానా? అని ఆశ్చర్యపోయా.

tapsee pannu shocked seeing her light bill of rs 36000
Author
Hyderabad, First Published Jun 29, 2020, 7:32 AM IST

హీరోయిన్ తాప్సీకి ఊహించని షాక్ తగిలింది. తన ఇంట్లో తనకు తెలీకుండా ఇంకెవరైనా ఉంటున్నారేమో అనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. ఆమె అలా అనడానికి కారణం లేకపోలేదు. గత నెల ఆమెకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే.. ఎవరైనా అదే అనేస్తారేమో.. తాప్సీ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా రూ.36వేలు వచ్చింది. దీంతో ఆ బిల్లు చూసి షాకైన బ్యూటీ... ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

‘‘ఏప్రిల్‌లో రూ. 4,390, మేలో రూ. 3,850 బిల్‌ వచ్చింది. జూన్‌కి రూ. 36,000 బిల్‌ పంపారు. గత నెల మా కరెంట్‌ బిల్‌ అంతలా పెరగడానికి మూడు నెలల లాక్‌డౌన్‌ కాలంలో నేను ఏమైనా కొత్త ఎలక్ట్రిక్‌ వస్తువులు కొన్నానా? ఎక్కువ వినియోగించానా? అని ఆశ్చర్యపోయా. అదానీ ఎలక్ట్రిసిటీ ఏ అధికారంతో ఇంత వసూలు చేస్తుంది?’’ అని తాప్సీ ట్వీట్‌ చేశారు. 

 

ఓ విధంగా ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టినట్టుందని పేర్కొన్నారామె. ఎవరూ లేని అపార్ట్‌మెంట్‌కి అంత బిల్‌ పంపించడంపై తాప్సీ వ్యంగ్యంగా స్పందించారు. తమ మరో అపార్ట్ మెంట్ కి వచ్చిన కరెంట్ బిల్లుపై కూడా ఆమె స్పందించారు. దాని గురించి మరో ట్వీట్ లో...
‘‘శుభ్రం చేయడానికి వారానికి ఒకసారి వెళ్లడం తప్ప ఈ అపార్ట్‌మెంట్‌లో మేమెవరూ ఉండటం లేదు. మార్చిలో రూ. 570, ఏప్రిల్‌లో రూ. 730 రాగా... మే నెలకి గాను రూ. 8,640 బిల్‌ వచ్చింది. మాకు తెలియకుండా ఎవరైనా మా అపార్ట్‌మెంట్‌ ఉపయోగిస్తున్నారేమోనని ఆందోళన చెందుతున్నా. వాస్తవాలు తెలుసుకోవడంలో మాకు అదానీ కంపెనీ సహకరించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. అంత పవర్‌ బిల్‌ చూసి తన ముఖంలో చిరునవ్వు చెదురుతోందని ఆమె అన్నారు.

కేవలం తాప్సీకి మాత్రమే కాదు.. ఇలాంటి అనుభవం మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా ఎదురైంది. తెలుగులో ‘జోష్‌’, ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ చిత్రాల్లో నటించిన కార్తీకా నాయర్‌ అమాంతం ఎక్కువ వచ్చిన కరెంట్‌ బిల్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘జూన్‌ నెలకు గాను ఎలక్ట్రిసిటీ బిల్‌ దగ్గర దగ్గర లక్ష రూపాయలు వచ్చింది. ముంబైలో అదానీ కంపెనీ ఎటువంటి కుంభకోణానికి పాల్పడుతోంది? ముంబై ప్రజలు నుంచి ఇటువంటి కంప్లయింట్స్‌ చాలా వింటున్నాను’’ అని కార్తీక అన్నారు. ‘మీకు హోటల్‌ ఉందా?’ అని నెటిజన్‌ ప్రశ్నిస్తే... ‘‘అది నా హోటల్‌ బిల్‌ అయితే బావుండేది. కానీ, నా ఇంటికి వచ్చిన కరెంట్‌ బిల్‌’’ అని ఆమె సమాధానం ఇచ్చారు.

ఇక మరో నటి శ్రద్ధాదాస్ కి రూ. 34 వేలు కరెంట్‌ బిల్‌ వచ్చిందని నోరెళ్లబెట్టారు. ఆమె కూడా అదానీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios