బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ఆ మధ్య వార్తల్లో నిలిచినా తనుశ్రీదత్తా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనకి తీర్పుని వెల్లడించారు.

ఈ నెల 22న నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు. దీనిపై తనుశ్రీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిర్భయ నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించి నిర్భయకి న్యాయం చేశారు కానీ ఇలా ఎంతమందిని ఉరి తీసుకుంటూపోతారని ప్రశ్నించారు.

'దర్బార్' రివ్యూ!

ఉరితీయడం కాకుండా మరేదైనా పరిష్కారం గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పింది. ఉరిశిక్ష, చావు అనేవి ఎప్పటికీ పరిష్కారం కావని.. అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడిన రోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వద్దని చెబుతున్నట్లుగా ఉండడంతో నెటిజన్లు తనుశ్రీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

అలాంటి వాళ్లు సమాజంలో బ్రతకడానికి వీల్లేదని.. వారికి ఉరిశిక్షే సరైన శిక్ష అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్ లోని ఒకేసారి ఉరి తీయనున్నారు.