భారీ అంచనాలతో విడుదలైన 'తాంత్రికుడు'
నిన్న విడుదలైన 'తాంత్రికుడు ' సినిమా విశేషాలు ఇక్కడ చదవండి:

అభిమానుల, ప్రేక్షకుల కోలాహలం మధ్య గురువారం విడుదలైన ' తాంత్రికుడు ' సినిమా మంచి టాక్ తో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో సన్నీ కునాల్ కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
మొదటి సినిమాతోనే... అద్భుతమైన నటనతో, రోమాంచితమైన ఫైట్స్, ఆకట్టుకునే అందం, ఆరడుగుల సిక్స్ ప్యాక్ తో యంగ్ హీరో సన్నీ కునాల్ ప్రేక్షకుల జేజేలు అందుకున్నాడు. ప్రదర్శన అనంతరం సన్నీ కునాల్ అభిమానులు అతనిని ఘనంగా సన్మానించి టపాసులు పేల్చి సందడి చేశారు.
అనంతరం దర్శకుడు సంఘ కుమార్ మాట్లాడుతూ " సినీ కళామతల్లి ఒడికి చేరిన టాలెంటెడ్ యంగ్ హీరో సన్నీ కునాల్ కు మంచి భవిష్యత్తు ఉంది. అతనితో నవంబర్ లో ఒక సినిమా ప్లాన్ చేశాను. ఒక షెడ్యూలు అరకులో, మరొక షెడ్యూలు హైదరాబాదులో షూటింగ్ చేస్తాను." అని ఆనందం వ్యక్తం చేశారు.
హీరో సన్నీ కునాల్ మాట్లాడుతూ" ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. సినీ చరిత్రలో నాదైన ఒక పేజీ కోసం ఇష్టంగా కష్టపడతాను. నిర్మాతల హీరోగానే ప్రయాణం కొనసాగిస్తాను " అని భావోద్వేగంగా మాట్లాడారు.
సినిమాలో నటించిన హీరోయిన్లు అనూష త్రివేణి, యాక్షన్ సీన్స్ అద్భుతంగా పండించిన రాజేష్, కడుపు చెక్కలయ్యేలా నటించి నవ్వించిన కమెడియన్ పట్నాయక్ లతో పాటు ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణులు ప్రేక్షకులతోపాటు సినిమాను వీక్షించి అభినందనలు అందుకున్నారు.