గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో ఓ బయోపిక్ రూపొందుతోంది.

మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్ గా పని చేసిన యోధుడు తానాజీ జీవిత కథ ఆధారంగా 'తాన్హాజీ' అనే సినిమాను రూపొందిస్తున్నారు. 'ది అన్ సంగ్ వారియర్' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో అజయ్ దేవగన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషించాడు. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ మొత్తం ఎంతో గ్రాండ్ గా ఉందనే చెప్పారు. 1670 వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యం లిఖించబడిన చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

తానాజీ మొఘల్ సామ్రాజ్యంలో విరుచుకుపడిన సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. యుద్ధ సన్నివేశాలను భీకంగా చిత్రీకరించారని అనిపిస్తోంది. కాజోల్ కాసేపే కనిపించినా.. ఆకట్టుకుంది. నేపధ్య సంగీతం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో సైఫ్ అలీ ఖాన్ చెప్పిన డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.