మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి, చిత్ర రంగంలో ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించలేదు. అది వేరే విషయం. అనంతరం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 

ఇప్పుడు ఈ వివరణ అంతా ఎందుకంటే.. త్వరలో చిరంజీవి సినిమా రంగానికి సంబంధించిన ఓ పదవి చేప్పట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవిని కలసిన తర్వాత ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నంది అవార్డుల కమిటీకి చిరంజీవిని చైర్మన్ గా నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

దీనిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి వ్యక్తికి అంత చిన్న పదవి వద్దని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవి స్థాయికి అది చాలా చిన్న పదవి. అలాంటి చైర్మన్ పదవుల్లో ఖాళీగా ఉండేవాళ్ళే ఉంటారు. కానీ చిరంజీవి ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. 

నడుము సొగసుతో శ్రీయ అందాల విందు.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

అలాంటి వ్యక్తికీ నంది అవార్డుల చైర్మన్ పదవి వద్దని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల టాలీవుడ్ కు మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కుగా మారిన సంగతి తెలిసిందే. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరిని చిరు ప్రోత్సహిస్తున్నారు.