రేసింగ్ అంటే బాగా ఇష్టపడే హీరోలలో అతిజ్ కుమార్ ఒకరు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు అడ్వెంచర్ టూర్ కు రెడీ అయిపోతుంటాడు అజిత్. తాజాగా ఆయన వరల్డ్ టూర్ లో ఉన్నాడు. అక్కడ తన మనసు గెలుచుకున్న వక్తికి.. జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు అజిత్. 

మన ఇండియన్ హీరోలలో.. చాలా మందికి.. ఇటు ఇండస్ట్రీతో పాటు..అటు ఏదోఒక దానిలో నైపుణ్యం ఉంది. కొంత మంది మంచి స్పోర్డ్స్ మెన్స్ అవ్వగా.. మరికొంత మంది రైడర్స్.. ఇలా ఏదొఒక దాంట్లో తమ టాలెంట్ నుచూపించుకుంటూనే ఉంటుంటారు. అలాంటి వారిలో అజిత్ కుమార్ పేరు ముందు వినిపిస్తుంది. ఎందుకంటే.. అజిత్ కు బైక్ రైడింగ్ అంటే ప్రాణం. రైడింగ్ ను ఇష్టపడే అతి తక్కువ ప్రముఖ హీరోలలో అజిత్ కూడా ఒకరు. అజిత్ కు కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు.. బైక్ పట్టుకుని బయలుదేరుతాడు. ఎక్కడికి.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు కాని.. అవసరం అయితే దేశం దాటి వెళ్లడానికి కూడా ఆయన రెడీగా ఉంటాడు. ముఖ్యంగా దేశవ్యాప్తం పర్యటనలు.. అది కూడా బైక్ పై వెళ్ళడం అంటే అజిత్ కు చాలా ఇష్టం. 

బైక్ రైడింగ్ అంటే అజిత్ కు ప్రాణం.. రీసెంట్ గా అజిత్ మన దేశంలో లోని ప్రధాన నగరాలతో పాటు.. పక్క దేశాలైన నేపాల్, భూటాన్​తో పాటు యూరప్​లోని కొన్ని సిటీల్లోనూ బైక్​పై తెగ తిరిగేశాడు. ఇక ఆమధ్య నేపాల్​లో అజిత్ బైక్​ టూర్​లో ఉండగా.. ఆయనతో పాటు రైడింగ్ చేస్తూ.. అజిత్ కు బాగాసహాయం చేశాడు ఓ వ్యక్తి. అజిత్ కు సాయంగా నిలిచిన ఆ తోటి రైడర్ పేరు సుగత్ సత్పతి. అజిత్ తో పాటు.. ఆయన వేవ్ కు దగ్గరగా ఉన్న ఆ వ్యాక్తికి అజిత్ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. 

View post on Instagram

సుగత్ కోసం ఏకంగా 12 లక్షల 50 వేల రూపాయలు విలువైన బీఎండబ్ల్యూ సూపర్ బైక్​ను కొని అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడు అజిత్. గోలు చేశారు అజిత్. టూర్​లో తనకు సాయం చేసినందుకు సుగత్​కు బైక్​ను బహుమతిగా ఇచ్చారు అజిత్. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు సుగత్. ఇంత పెద్ద సూపర్​స్టార్​తో టచ్​లో ఉండటం తన అదృష్టమన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్పతి చేసిన పోస్ట్ కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. 

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమద్య తునివు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అజిత్ కుమార్ . తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ అయిన సినిమా థియేటర్ లో పెద్దగా నడవలేదు. కాని ఓటీటీలో మాత్రం ఈసినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూంటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి.. రైడింగ్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు అజిత్. ఆతరువాత సినిమాను బారీగా ప్లాన్ చేస్తున్నాడట. త్రిష.. ఈసినిమాలో హీరోయిన్ అనిటాక్.