కోలీవుడ్ లో మరొక సీనియర్ నటుడు, దర్శకుడు కన్నుమూశారు. కరోనా బాధిస్తున్న తరుణంలో తమిళ సినీ పరిశ్రమలో మరొక తీరని లోటును కలిగించిన ఈ విషధం అందరిని షాక్ కి గురి చేసింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విసు ఆదివారం చెన్నై ఆసుపత్రిలో చిక్కిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త కోలీవుడ్ ప్రముఖులను తీవ్రంగా కలచివేసింది.

గత కొంత కాలంగా యాక్టర్ విసు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని వారాల క్రిందట మెల్లగా కొలుకుంటున్నట్లు కుటుంబ సన్నిహితుల నుంచి టాక్ వచ్చింది. అయితే ఇంతలోనే ఆయన మృతి చెందినట్లు చెప్పడం బాధగా ఉందని కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 75 ఏళ్ల వయసు కలిగిన విసు అసలు పేరు ఎంఆర్.విశ్వనాథ్. సీనియర్ దర్శకులు కె.బాలా చందర్ వద్ద కొన్నేళ్లపాటు సహాయ దర్శకులుగా పని చేశారు.

తమిళ్ సినిమా 'తిల్లూముల్లు' సినిమాతో యాక్టర్ గా మారి 'కణ్మణి పుంగా' సినిమాతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఆడదే ఆధారం, శ్రీమతి ఇక బహుమతి వంటి క్లాసిక్ మూవీస్ తెలుగులో రీమేక్ అయ్యాయి. రజినీకాంత్ అరుణాచలం సినిమాలో రంగాచారి గా ఆయన చేసిన రోల్ కి సౌత్ ఇండస్ట్రీలో లో మంచి గుర్తింపు దక్కింది.