మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు అచ్చింది. ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినిమా కోసం పని చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులు హాజరయ్యారు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ 
పేరుపేరున థాంక్స్ చెప్పారు చిరు.

అలానే రామ్ చరణ్ కూడా నిర్మాతగా తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో నటి తమన్నా కూడా మాట్లాడింది. 'సైరా'లో లక్ష్మీ పాత్రకి చక్కటి ఆదరణ దక్కుతోందని తనకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెప్పింది. ఈ సందర్భంలో చరణ్ కి థాంక్స్ చెబుతూ.. 'చరణ్‌.. నువ్వు కో యాక్టర్‌గా బెటరా..? ప్రొడ్యూసర్‌గా బెటరా..? ఏం చెప్పాలి రా?' అని టక్కున అనేసింది.

రామ్ చరణ్ ని అంత చనువుగా 'రా' అని అనడంతో స్టేజ్ పై ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలో చరణ్, తమన్నాలు కలిసి సినిమాలు చేశారు. అప్పటినుండే వీరిమధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే తమన్నా అందరిముందు 'రా' అని పిలిచి ఉంటుందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకి తెలుగు సరిగ్గా రాకపోవడంతో నోరు జారి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా ఏ ఉద్దేశంతో చరణ్ ని 'రా' అని పిలిచినా.. సోషల్ మీడియాలో మాత్రం ఇది పెద్ద చర్చకు దారి తీసింది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మించాడు. అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో నటించారు.