టాలీవుడ్ మిల్కీ బ్యూటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ 'తమన్నా'. కుర్ర హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా తమన్నా మాత్రం అదే దూకుడుతో ముందుకు సాగుతోంది. గత ఏడాది F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఏ ముద్దుగుమ్మ సైరా సినిమాలో కూడా పాజిటివ్ రోల్ తో మంచి క్రేజ్ అందుకుంది.

ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ మరో డిఫరెంట్ రోల్ తో అలరించబోతోంది. గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో కబడ్డీ కోచ్ గా తమన్నా పవర్ఫుల్ రోల్ లో దర్శనమివ్వనుంది. చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన ఆమె ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో జ్వాలా రెడ్డిపై అనే పాత్రలో తమన్నా కనిపించబోతోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇక తమన్నా ఫస్ట్ లుక్ చూస్తుంటే.. చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇకపోతే సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ కూడా కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు థ్రిల్ చేసే ఎపిసోడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.