మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. నేలటికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఫ్లాపులు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నాడు. 

ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శత్వంలో క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రవితేజ తదుపరి చిత్రం త్రినాధ్ రావు నక్కిన దర్శత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా తమన్నాని పరిశీలిస్తున్నారు. దీనికోసం దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదించగా.. రెమ్యునరేషన్ బాంబుతో వారిని బయపెట్టినట్లు తెలుస్తోంది. 

చీరకట్టులో బిగ్ బాస్ పిల్ల నడుము అందాలు.. భలే సెక్సీ..

ఫలితంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకున్నట్లు టాక్. దర్శకనిర్మాతలు తమన్నాకు 2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ తమన్నా మాత్రం దిమ్మతిరిగే విధంగా 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంత రెమ్యునరేషన్ ఇవ్వలేమని చెప్పడంతో తమన్నా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

తమన్నా, రవితేజ గతంలో బెంగాల్ టైగర్ చిత్రంలో నటించారు. తమన్నా ఇటీవల పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది తక్కువ. ప్రస్తుతం తమన్నా సీటిమార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.