ఈ రోజుల్లో స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. యువత వెబ్ సిరీస్ లకు ఈజీగా కనెక్ట్ అవుతోందని  నేటితరం తారాగణం కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ హడావుడి చేస్తున్నారు.గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోయిన్స్ కూడా డిజిటల్ వరల్డ్ లో దిగుతున్నారు.

కొందరు గ్లామర్ ప్రజెంటేషన్ తో అదరగొడుతుంటే మరికొందరి వారి అసలైన యాక్టింగ్ స్కిల్స్ ని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు తమన్నా కూడా ఒక వెబ్ సిరీస్ ద్వారా తన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ద నవంబర్ స్టోరీ అనే తమిళ్ వెబ్ సిరీస్ లో తమన్నా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ద నవంబర్ స్టోరీ క్రిమినల్ ఫాదర్ - డాటర్ మధ్య కొనసాగుతుందట.

 

ఈ సిరీస్ లో జిఎమ్.కుమార్ తండ్రి పాత్రలో నటిస్తుండగా రామ్ సుబ్రహమణ్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తమన్నా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలాంటి ఛాలెంజిగ్ రోల్స్ చేయడానికి తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పిన తమన్నా భవిష్యత్ లో మరిన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలనీ ఉందని వివరణ ఇచ్చింది.