టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ నివాసానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. దశాబ్దాలుగా టాలీవుడ్ లో అలీ అగ్ర కమెడియన్ గా కొనసాగుతున్నారు. అలీకి సినీప్రముఖులందరితో పాటు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

ఇటీవల అలీ తల్లి బీబీ మరణించారు. వయసుపైబడడం, అనారోగ్యం కారణాలతో ఆమె డిసెంబర్ 19న తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు అలీ నివాసానికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా మంత్రి తలసాని మణికొండలోని అలీ నివాసానికి వెళ్లారు. అలీ తల్లి మరణించడంతో అతడి కుటుంబసభ్యులని పరామర్శించారు. అలీతో కలసి తలసాని కొంత సమయం మాట్లాడారు. 

తలసాని రెండవసారి సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా భాద్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు సంబంధించిన శాఖ కావడంతో.. తలసాని దాదాపుగా టాలీవుడ్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు.