ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ ల హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారులకు సంబందించిన సినిమాల బజ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా మంది క్రీడాకారుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒక లేడి క్రికెటర్ కి సంబందించిన బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాప్సి ఆ ప్రాజెక్ట్ లో కథానాయికగా కనిపించబోతోంది.  ఆ బయోపిక్ మరెవరిదో కాదు. ఇండియన్ ఉమెన్ క్రికెట్ స్థాయిని పెంచిన మిథాలీ రాజ్. నేడు మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్బంగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. మిథాలీ పాత్రలో తాప్సి నటిస్తుండగా షారుక్ ఖాన్ నటించిన రాయిస్ సినిమా దర్శకుడు రాహుల్ దొలాకియా ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాకు శబాష్ మిథు అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు.

వైకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించాడని సిద్ధమైంది.  అసలైతే ఈ ఏడాది మొదట్లోనే సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నప్పటికీ స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడంతో ఇన్నాళ్ళకి మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గత కొంత కాలంగా మిథాలీ పాత్ర కోసం ఆమెతో చాలారోజులుగా ట్రావెల్ చేసింది. అలాగే క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుందట. మరి ఈ సినిమాతో తాప్సి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.