ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం తాప్సి కి అలవాటే. బోల్డ్ కామెంట్స్ తో ఈ మధ్య తాప్సి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక బాలీవుడ్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న తాప్సి రీసెంట్ గా ఒక షోలో చేసిన కామెంట్స్ కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక వ్యక్తి చేసిన పనికి తాప్సి గట్టి కౌంటర్ ఇచ్చిందట.

రీసెంట్ గా తాప్సి కరీనా కపూర్ టాక్ షోకి గెస్ట్ గా వెళ్లింది. అయితే అక్కడ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది. తాప్సి మాట్లాడుతూ.. తన టీనేజ్ లైప్ దాటిన అనంతరం గురుపురబ్ సమయంలో మేము గురుద్వారానికి వెళ్లేవాళ్ళం. దాని ప్రక్కన ఉన్న స్టాల్స్ దగ్గర రద్దీ చాలా ఉండేది. అయితే అక్కడ వికృత చర్యలను నేను ముందే ఊహించాను.

ఏదైనా తప్పు జరిగితే ఎదుర్కోవడానికి ముందే సిద్దమయ్యాను. నేను ఆ జనాల మధ్య నుంచి వెళుతుండగా ఒక వ్యక్తి నన్ను ఫాలో అవ్వడం గమనించాను, అప్పటికే అతని చేతులు కదలడం గమనించాను. నా వెనక వైపు చేతులు వేయబోతుండగా చివరి సెకనులో పసిగట్టి అతని వేలిని మెలితిప్పేశా. దాదాపు విరిచేసే ప్రయత్నమే చేశాను' అంటూ తాప్సి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తాప్సి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.