తెలుగువారికి సుపరిచితమైన నటి తాప్సి ఇంట విషాదం చోటు చేసుకుంది. తాప్సి పన్ను నానమ్మ మరణించింది. గురుద్వారాలో జరిగిన తన నానమ్మ అంతిమ సంస్మరణ ఫోటోను పోస్ట్ చేసి తమ కువైటుంబంలో గత తరానికి చెందిన చివరి వ్యక్తి కూడా దేవుని చెంతకు వెళ్లిపోయారని, ఆమె మరణం వల్ల ఏర్పడే శూన్యత ఎప్పటికి పూడ్చలేనిది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది తాప్సి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️

A post shared by Taapsee Pannu (@taapsee) on May 30, 2020 at 3:04am PDT

తాప్సి ఈ పోస్ట్ పెట్టగానే నెటిజెన్ల ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేయడంతోపాటుగా తాప్సిని ధైర్యం  కోల్పోకుండా ధృడంగా ఉండాలని కోరారు. థప్పడ్ సినిమా సహనటుడు పవైల్ గులాఠి అందరికన్నా ముందుగా ఈ పోస్ట్ పెట్టగానే తన సంతాపాన్ని తెలిపాడు. 

గతంలో ఎప్పుడూ కూడా తన లవ్ లైఫ్ గురించి పెదవి విప్పని తాప్సి, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది తాప్సీ.

గతంలో ఈ భామను లవ్‌ లైఫ్‌ గురించి అడగ్గా ఎప్పుడూ స్పందించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు. తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో వెల్లడించింది తాప్సీ. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది తాప్సీ. ఒక వేళ తల్లి దండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోయి ఉంటే తాను బో తో రిలేషన్‌ను వదులుకునే దానినని చెప్పింది.

`బోను నా జీవితంలోకి ఆహ్వానించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. గతంలో ఎప్పుడూ నా ప్రేమ గురించి మాట్లాడినా నా బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరు అన్న విషయం మాత్రం చెప్పలేదు. అందుకు కారణం లేకపోలేదు. నేను నటిగా ఓ గుర్తింపు తెచ్చుకున్న తరువాతే తన పార్టనర్‌ పేరును వెళ్లడించాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు. ఒకవేళ నేను గతంలోనే నా పేరు బాయ్‌ ఫ్రెండ్ పేరు చెప్పుంటే ఇన్ని విజయాలు నాకు దక్కేవి కావు` అంటూ చెప్పింది తాప్సీ.

`నేను రిలేషన్‌లో ఉన్న సంగతి నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. నా సోదరి, తల్లిదండ్రులు అందరికీ నా ప్రేమను అంగీకరించారు. ఒకవేళ వాళ్లు అంగీకరించకపోతే నేను నా ప్రేమను అంగీకరించలేను` అని చెప్పింది. తాప్సీ ఇటీవల అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన థప్పడ్ సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాతో తాప్సీకి మరోసారి నటిగా మంచి పేరు వచ్చింది.