హీరోయిన్ తాప్సి నటించిన తాజా చిత్రం 'థప్పడ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం తాప్సి ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తోంది. టాలీవుడ్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో నటించిన తాప్సి బాలీవుడ్ కు వెళ్ళాక రూట్ మార్చింది. 

కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉండే కథలు ఎంచుకుంది. తాప్సి ఎంచుకున్న ఈ మార్గం మంచి ఫలితాలని ఇచ్చింది. బద్లా, పింక్, మిషన్ మంగళ్, తాజాగా థప్పడ్ చిత్రాలతో తాప్సి సక్సెస్ అందుకుంది. తాజాగా తాప్సి అందమైన శారీ ధరించిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 

రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ఫోటోకు ఎమోషనల్ కామెంట్స్ జత చేసింది. నేను ధైర్యవవంతురాలిని.. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిడారంబరంగా ఉంటాను.. ఎందుకంటే నిరాశని ఎదుర్కొన్నాను. నేను బలవంతురాలిని.. పరిస్థితులే నన్ను అలా మార్చాయి. నేను సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను' అని తాప్సి ఎమోషనల్ కామెంట్స్ పోస్ట్ చేసింది. 

తాప్సి ఫోటోపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ 'సుందరి' అని కామెంట్ చేసింది. ఇక థప్పడ్ దర్శకుడు అనుభవ సిన్హా 'నువ్వు స్మార్ట్ అయ్యావు తాస్పి' అని కామెంట్ చేశాడు.