తెలుగులో సత్తా చాటలేకపోయిన ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌లో మాత్రం వరస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అక్కడ మంచి హిట్లు కొడుతూ చెప్పుకోదగిన విధంగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది. ఇప్పటికే భారతజట్టు మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న తాప్సీ మరో సినిమాకు సైన్ చేసేసింది. 1998లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించిన జర్మన్‌ చిత్రం ‘రన్‌ లోలా రన్‌’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తాప్సీ. బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ కనిపించనున్నారు.

‘రన్‌ లోలా రన్‌’ సినీ ప్రపంచ చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిచింది. లోలా అనే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఓ పెద్ద మాఫియా డాన్ నుంచి కాపాడుకోవడానికి 20 నిమిషాల్లో లక్ష డచ్‌ మార్క్స్‌ను (జర్మన్‌ కరెన్సీ) ఎలా సంపాదించిందనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో తాప్సీ ప్రారంభం నుంచి పాత్ర పరుగెడుతూనే ఉంటుంది. పరుగు ఆపిందా బోయ్ ప్రెండ్ ప్రాణం పోతుంది.  ఇప్పుడీ చిత్రాన్ని ‘లూప్‌ లపేటా’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తిడుతోంది.. శ్రీరెడ్డిపై కంప్లైంట్!

ఈ సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి అద్బుతమైన చిత్రాలను భారతీయ భాషల్లోకి రీమేక్ చేయటం శుభపరిణామం. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రధాన పాత్రలో తాప్సి నటించనుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ కనిపించనున్నాడు. ఆకాష్‌ భాటియా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాప్సీ నటించిన ‘తప్పడ్‌’ ఫిబ్రవరి 28న, తాహీర్‌ నటించిన ‘83’ సినిమా ఏప్రిల్‌ 10న అభిమానుల ముందుకు రానున్నాయి.