మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాంచరణ్ నిర్మాణంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక యజ్ఞంలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సైరా సక్సెస్ తో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రిలీజ్ తర్వాత కూడా సైరా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ తెలంగాణ గవర్నర్ తమిళసై కోసం సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

త్వరలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సైరా చిత్రాన్ని వీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బెంగుళూరులో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియన్ ఆర్మీ కోసం సైరా చిత్ర ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.