మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ తలచుకుంటే రాజమౌళి డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కేది. కానీ రామ్ చరణ్ నిర్ణయంతో దర్శకుడు సురేందర్ రెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. కొన్ని ఏరియాల్లో బయ్యర్స్ కి నష్టాలు తప్పలేవు.

ప్యాన్ ఇండియన్ లెవెల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను ప్రజెంట్ చేయలేకపోయాడనే కామెంట్స్ కూడా వచ్చాయి. పక్కా భాషలో భారీగా రిలీజ్ చేసినప్పటికీ సినిమా ఏ మాత్రం క్లిక్కవ్వలేకపోయింది. ఆ విషయం పక్కనపెడితే సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది స్టార్ హీరోలతో సురేందర్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నాడనేది వాస్తవం.

ఇక ఫైనల్ గా సురేందర్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ తోనే తన నెక్స్ట్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు అతిధి సినిమా వచ్చింది.  2007లో వచ్చిన ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక మళ్ళీ వీరి కాంబో కలవలేదు. రీసెంట్ గా మహేష్ సురేందర్ రెడ్డి కలుసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టక వస్తోంది. సురేందర్ రెడ్డి తన దగ్గర ఉన్న స్టోరీ ఐడియాని మహేష్ కి వివరించాడట. మహేష్ కి ఆ కథ నచ్చింది గాని బాండ్ స్క్రిప్ట్ అయితే గాని సినిమా చెయలేనని ఒక కండిషన్ చెప్పినట్లు తెలుస్తోంది.  

ఇక సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ఫినిష్ చేయాలనీ తన రైటర్స్ తో డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఆ తరువాత మహేష్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా కథ వినిపించడంతో ఎవరితో ఫిక్స్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.