మెగాస్టార్ నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా అక్టోబర్ 2న విడుదలై మంచి హిట్ టాక్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. సోమవారం నాడు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు కనిపించినా.. దసరా అడ్వాంటేజ్ ని ఈ సినిమా పూర్తిగా క్యాష్ చేసుకుంది. ఏడో రోజు ఈ సినిమా రూ.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రెండుతెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా రూ.83 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.  

ఏరియాల వారీగా మొదటి వారం కలెక్షన్స్..
నైజాం........................................రూ.23.95 కోట్లు 

సీడెడ్.........................................రూ.15 కోట్లు 

ఉత్తరాంధ్ర................................రూ.12.30 కోట్లు 

గుంటూరు...................................రూ.8.45 కోట్లు 

ఈస్ట్...............................................రూ.7.45 కోట్లు 

వెస్ట్.................................................రూ.5.75 కోట్లు 

కృష్ణ.................................................రూ.6.43 కోట్లు 

నెల్లూరు..........................................రూ.3.90 కోట్లు 

మొత్తం ఏపీ, తెలంగాణాలో కలిసి ఈ సినిమా రూ. రూ.83 కోట్లను సాధించింది.  కర్నాటకలో రూ.13.30 కోట్లు, కేరళ, నార్త్ ఇండియా, తమిళనాడులో కలుపుకొని రూ.7.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.11.80 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటివారానికి గాను రూ.115.53 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.