మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో అందుకున్నంత కలెక్షన్స్ ని సైరా అక్కడ రాబట్టలేకపోయింది.

ఓపెనింగ్స్ లోనే సైరా తడబడింది. అమితాబ్ బచ్చన్ క్రేజ్ అలాగే అమిత్ త్రివేది మ్యూజిక్ సినిమాకు నార్త్ సైడ్ నుంచి బూస్ట్ ఇవ్వేలేకేపోయాయి. సినిమాకు సంబందించిన లేటెస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. హిందీలో 7.5కోట్లు మాత్రమే దక్కినట్లు సమాచారం. చిత్ర యూనిట్ అనుకున్నంతగా ప్రమోషన్స్ చేయకపోవడం అలాగే నార్త్ జనాల అంచనాలకు చేరకపోవడం కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్లు టాక్ వస్తోంది. అసలైతే సినిమా ఓపెనింగ్స్ తో బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూందని అంతా భావించారు.

కానీ సినిమా మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ ని కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు. 270కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. కన్నడ - తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే అందుతున్నాయి. తెలంగాణలో హాలిడేస్ ని ఇంకాస్త పొడిగించడంతో సెకండ్ వీక్ కూడా సినిమాకు కలిసొచ్చే అంశం.