తమ మధ్య నెలకొన్న విభేదాల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మనోజ్ ప్రకటించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ఇలాంటి ఒడిదుడుకులని అధికమించి త్వరలో సినిమాల్లో బిజీ కానున్నట్లు మనోజ్ అభిమానులకు తెలిపాడు. 

2015లో మనోజ్, ప్రణతిల వివాహం జరిగింది. ఒకరినొకరు ఇష్టపడే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మనోజ్ సినిమాలతో, ప్రణతి వర్క్ తో బిజీ కావడంతో వీరిద్దరూ కలసి జీవించే సమయం దొరకలేదు. అలా వీరిమధ్య దూరం పెరిగినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలా ఉండగా మనోజ్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అతడి అభిమానులంతా మద్దతు తెలుపుతున్నారు. మునుపటిలా సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. 

బిగ్ బాస్ షో కోసం తనని ఇంటర్వ్యూకి పిలిచి లైంగికంగా వేధించారని ఇటీవల ఆరోపణలు చేసిన శ్వేతా రెడ్డి మనోజ్ విడాకుల వ్యవహారంపై తాజాగా కామెంట్స్ చేసింది. మనోజ్ తన విడాకుల విషయాన్ని అభిమానులకు తెలియజేసి మంచి పని చేశాడు. కొంతమంది సెలెబ్రిటీలు తమ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగితే కనీసం నోరు కూడా మెదపరు. అన్ని విషయాలని అభిమానులతో పంచుకునే సెలెబ్రిటీలు.. ఇలాంటి బాధాకర సంఘటనలని కూడా ఫ్యాన్స్ కు తెలియజేయాలి. 

అందులో తప్పు ఏమీ లేదు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం తాను మనోజ్ ని అభినందిస్తున్నానని శ్వేతా రెడ్డి పేర్కొంది. తమ చిత్రాలు విజయం సాధిస్తే సంతోషాన్ని అభిమానులతో పంచుకునే హీరోలు.. బాధని ఫ్యాన్స్ తో ఎందుకు పంచుకోరు అని శ్వేతారెడ్డి ప్రశ్నించింది.