అవును..గత కొద్ది కాలంగా..అల్లరి నరేష్ ఓ సాంగ్ రీమిక్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. మహేష్  హీరోగా నటించిన ‘మహర్షి’లో  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మంచి మార్కలే కొట్టేసిన నరేష్... పి.వి.గిరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఒకప్పటి బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. పూజా ఝవేరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాను ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.  

 ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలకృష్ణ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ వాడుకోవడమే కాదు.. ఈ సినిమాలో సూపర్ హిట్టైయిన స్వాతిలో ముత్యమంత పాటను కూడా ఈ సినిమాలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వింతేముంది పాత న్యూసే కదా అంటారా..అయితే కొత్త న్యూస్ ఏమిటి అంటే...అదే పాటను బాలయ్య కూడా రీమిక్స్ చేయాలనుకోవటం.

తెలుగు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ని స్వాతిలో ముత్యమంత పాట రీమిక్స్ చేయమని కోరినట్లు సమాచారం. బాలయ్యకు ఇష్టమైన ఆ పాట రీమిక్స్ కు ఆయన డాన్స్ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే అల్లరి నరేష్ చేసినా ఫర్వాలేదని,ఎవరి వెర్షన్ వారిదే అని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారచం. అంజలి,బాలయ్యతో వర్షం లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. మాస్ కు ఇది విందు భోజనంలా బోయపాటి ప్లాన్ చేస్తున్నారట.
 
రీసెంట్ గా  'రూలర్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య అంతగా మెప్పించలేకపోయాడు. దాంతో తనకు సింహ, లెజెండ్ లాంటి భారీ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను తో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  బాలకృష్ణ ఈ సినిమాలో మూడు విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అందులో ఒకటి అఘోర పాత్ర. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి లో మొదలుకానుంది. మార్చి 2 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలిని ఎంపిక చేశారు .