సినిమాలతో కంటే.. వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది నటి స్వరా భాస్కర్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ వివాదాస్పద అంశాలపై దూకుడుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె పాల్గొనే టీవీ షోలలో కూడా బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది. ఇటీవల స్వరా ఓ కామెడీ షోలో పాల్గొంది.

ఈ క్రమంలో ఆమె పిల్లల్ని దెయ్యాలని చెప్పడం, ఓ బాలుడిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడడం జరిగింది. సౌత్ కి చెందిన ఓ యాడ్ లో నటిస్తోన్న సమయంలో ఓ బాలనటుడు తనను 'ఆంటీ' అన్నాడని వెల్లడిస్తూ ఆ బాలుడిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడింది. 

అడవిలో అమలాపాల్ కష్టాలు.. మరి బయటపడుతుందా..?

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ని కూడా వెలికితీస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. స్వరాపై రకరకాల మీమ్స్ సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో 'ఆంటీ స్వరా' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేశారు. పబ్లిసిటీ కోసం స్వరా ఈ విధంగా ప్రవర్తిస్తుందంటూ నెటిజన్లు ఆమె పరువు తీసే ప్రయత్నం చేశారు.

నెటిజన్ల నుండి తనకు వ్యతిరేకత ఎక్కువ అవుతుందని భావించిన స్వరా.. ఇప్పుడు మాట మార్చేసింది. తాను ఆ టీవీ షోలో పిల్లల గురించి సరదాగా కామెంట్స్ చేశానని, జనాలు తన మాటలను అపార్ధం చేసుకున్నారని, పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఓ యాడ్ చేస్తున్న సమయంలో తన అనుభవాన్ని సరదాగా షోలో పంచుకున్నానని.. ఆ పిల్లాడి గురించి కూడా సరదాగా మాట్లాడానని చెప్పింది.

షోలో కొంతమేర అసభ్య పదజాలాన్ని వాడిన అది కేవలం హాస్యం కోసమేనని.. పెద్దలకు అర్ధమయ్యే విధంగా హాస్యాస్పదంగా ఆ మాటలు వాడానని, అంతేకానీ ఇతరులను బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. అదొక కామెడీ షో అని. ఆ షో ఎలా నడుస్తుందో తెలిస్తే తన మాటల ఉద్దేశం ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుందని చెప్పుకొచ్చింది.