బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ బాంబే హైకోర్టులో వేసిన ఓ కేసులో విజయం సాధించారు. తాను విల్లాలకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసినందుకు గోవాకి చెందిన ఇంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ కంపనీ నుండి రావాల్సిన డబ్బుని ఇప్పించాలని కోరుతూ సుజానే ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

2013 సెప్టెంబర్ లో గోవాలో పన్నెండు విల్లాలకు ఇంటీరియర్ డిజైన్ చేసేలా సుజానే ఖాన్ ఇంజీ ప్రాపర్టీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా రూ.168 కోట్లు, రెండో విడతగా రూ.5 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది.

'దర్బార్' దెబ్బ.. కోర్టుకెళ్లిన మురుగదాస్!

ఇంజీ ప్రాపర్టీస్ సుజానేఖాన్ డిజైన్లను తిరస్కరించడంతో ఒప్పందం ప్రకారం ఆమెకి డబ్బు చెల్లించలేదు. దీంతో తాము ఇంటీరియర్ డిజైన్ల తయారీకి గాను డిజైనర్ ఫీజు కింద రూ.2.52కోట్లు చెల్లించాలని సుజానేఖాన్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇంజీ ప్రాపర్టీ వ్యవస్థాపకుడు ముదీత్ గుప్తా కోర్టులో సమర్పించిన అప్పీలును డిస్మిస్ చేసిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ నందరాజోజ్, జస్టిస్ భారతి డాంగ్రీలు సుజానేఖాన్ కు రూ.2.52 కోట్లను చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.