కరోనా వైరస్‌ కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు తమ వర్క్ అవుట్ వీడియోస్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి, మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ తను యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే సుష్మితా సేన్‌ షేర్‌ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి.

అందరిలా రోటీన్‌గా ఫోటోలు షేర్ చేయకుండా తన బాయ్‌ ఫ్రెండ్‌ తో కలిసి చేసిన రొమాంటిక్ యోగా స్టిల్స్‌ను షేర్ చేసింది సుస్మితా సేన్‌. తన ఇన్‌ స్టాగ్రామ్ పేజ్‌లో సుస్మిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలతో పాటు `కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు` అంటూ కామెంట్ చేసింది ఈ ఏజ్‌ బార్ బ్యూటీ.

బాలీవుడ్‌ బ్యూటీ సుస్మిత తన కంటే చాలా చిన్నవాడైన రోమన్‌ షాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. వీరి రిలేషన్‌ షిప్‌ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం వారు ఖండించలేదు. దీంతో నిజంగానే సుస్మితా, రోమన్‌ల మధ్య ఏదో ఉందని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. తాజాగా వారు షేర్ చేసిన యోగా ఫోటోలతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టైంది.