సోషల్ మీడియా అభివృద్ధి చెందిన దగ్గర నుంచి సెల్రబిటీలకు సరికొత్త తల నొప్పులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా ఫేక్‌ న్యూస్‌ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే పలు సందర్భాల్లో ఆ ఫేక్ వార్తలను ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రచురించి ఇబ్బందుల పాలవుతుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటి సుష్మిత సేన్‌కు సంబంధించిన వార్త వివాదాస్పదమైంది.

ఓ ప్రముఖ మీడియా సంస్థలో సుస్మితా సేన్‌, అనిల్ అంబానిలకు సంబంధించి ఓ వార్త వచ్చింది. అయితే ఈ వార్తపై సుస్మితా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఈ వార్తల్లొ ఒక్క శాతం కూడా నిజం లేదన్న సుస్మిత, సదరు సంస్ధపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. మీరు జర్నలిజంకే మచ్చ అంటూ కామెంట్ చేసింది సుస్మిత. దీంతో సదరు సంస్థ ఈ వార్తను తొలగించింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సుస్మిత ఏదో ఒక వార్తతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే వీరి రిలేషన్‌కు సంబంధించిన చాలా వార్తలు వినిపించినా ఎప్పుడూ స్పందించిన సుస్మిత తాజాగా అంతగా రియాక్ట్ అవ్వటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.