ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక ట్రెండ్ నడుస్తోంది. కొందరు హీరోయిన్లు తమకన్నా బాగా వయసు తక్కువున్న కుర్రాళ్ళని ప్రేమిస్తున్నారు. ప్రియాంక చోప్రా కంటే నిక్ జోనస్ దాదాపు పదేళ్లు చిన్నవాడు.. మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 12 చిన్నవాడు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ కూడా మలైకా, ప్రియాంక బాటలోనే పయనిస్తోంది.

సుస్మిత సేన్ పెళ్లి  ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్ళు. ప్రస్తుతం సుస్మిత సేన్ మోడల్ గా రాణిస్తున్న 29 ఏళ్ళ రొహ్మాన్ షాల్ అనే కుర్రాడితో సహజీవనం చేస్తోంది. ఓ ఈవెంట్ ద్వారా వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఈ జంట దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 

సుస్మిత సేన్, రొహ్మన్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా సుస్మిత సేన్ తన ఇంస్టాగ్రమ్ ఓ బ్రీత్ టేకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తే హార్ట్ బీట్ అమాంతం రైజ్ కావడం ఖాయం. రొహ్మాన్, సుస్మిత సేన్ కలసి చేస్తున్న యోగా  ఫీట్ అలా ఉంది మరి. 

 

రొహ్మాన్ వెనుకవైపు నుంచి సుస్మిత సేన్ పట్టుకుని తన కాళ్లపై నిలుచోబెడతాడు. ఆ తర్వాత ఆమె భారం మొత్తం మోస్తూ చేతులు పట్టుకుని బ్యాలెన్స్ చేస్తున్న విధానం అదుర్స్ అనిపించే విధంగా ఉంది. నా ప్రియుడు రొహ్మాన్ దృఢమైనవాడు. 

రిలేషన్ షిప్ స్టేబుల్ గా ఉండాలంటే బ్యాలెన్సింగ్, నమ్మకం, ఇద్దరిలోనూ శక్తి అవసరం. అందుకు ఈ ఫోజు సరైన ఉదాహరణ అని సుస్మిత సేన్ కామెంట్ చేసింది.