కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే కొంత మంది మాత్రం ఈ హాలీడేస్‌ను రొమాంటిక్ యాంగిల్ లో యూజ్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్‌ ప్రకటించిన తరువాత కండోమ్‌ల అమ్మకాలు విపరీతంగా పెరగాయని ఓ సర్వే తేల్చింది. అయితే తాజాగా ఓ హీరోయిన్ సోదరుడు కూడా స్టీమీ ఫోటోలను తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశాడు.

ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ బిజీ లైఫ్‌లో ఉండే సెలబ్రిటీలకు తమ ఫ్యామిలీతో కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఇక హాట్ కపుల్స్‌కు ఈ లాక్‌ డౌన్‌ ఓ వరంలా దొరికింది. కండోమ్‌ సేల్స్‌ విపరీతంగా పెరిగాయంటేనే ఈ హాలీడేస్‌ను ప్రజలు ఎలా వాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.

తాజా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ సుష్మితా సేస్‌ సోదరుడు రాజీవ్‌ తన భార్యతో కలిసి రొమాంటిక్ మూడ్‌లో  ఉన్న ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలతో పాటు `క్వారెంటైన్‌ డేస్‌లో ప్రేమలో` అంటూ కామెంట్ చేశాడు. అలాంటి ఫోటోలనే తన పేజ్‌లోనూ షేర్‌ చేసిన రాజీవ్‌ భార్య `క్వారెంటైన్‌లో ఉండటం మాకు ఆనందంగా ఉంది` అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై నెటిజెన్లు విరుచుకుపడ్డారు. కొంత కాస్త ఘాటుగా కామెంట్ చేయటంతో కామెంట్స్ ను డిజెబుల్ చేశారు ఈ జంట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

in love with quarantined days 😘❤️ Ain’t you ? #stayhome

A post shared by Rajeev Sen (@rajeevsen9) on Mar 31, 2020 at 11:34am PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We are happy being quarantined . ❤️😍 #stayhome #staysafe.

A post shared by Charu Asopa Sen (@asopacharu) on Mar 31, 2020 at 11:23am PDT