Asianet News TeluguAsianet News Telugu

‘అల వైకుంఠపురములో ’సుశాంత్ లుక్ పోస్టర్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు.

SUSHANTH look IN ALA VAIKUNTHAPURAMLO
Author
Hyderabad, First Published Oct 20, 2019, 7:41 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు, హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు దర్శక,నిర్మాతలు.

 ఈ సినిమాలో సుశాంత్‌ ‘రాజ్‌’ అనే పాత్రను పోషిస్తున్నట్లు చిత్రం యూనిట్  తెలిపింది. ‘ఇతని అందమైన చిరునవ్వు ఎవరినైనా ఆకర్షిస్తుంది’ అని ఈ ఫొటోకు  క్యాప్షన్‌ ఇచ్చారు. ‘అల వైకుంఠపురములో’ కుటుంబం నుంచి రాజ్‌ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది.

సినిమాలో ఈ  పాత్ర ప్లే చేసే రోల్ ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ సినిమాలో సుశాంత్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని అల్లు అర్జున్ కు కి సోదరుడిగా నటిస్తున్నాడని కొందరంటే.. లేదు పూజా హెగ్డేకు అన్నయ్యగా కనిపిస్తాడని ఇంకొందరు అంటున్నారు. ఆ విషయం వైరల్ గా మారిపోయింది.

ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో టబు నటిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. గీతా ఆర్ట్స్‌ సంస్థ, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులోని స్పెషల్ సాంగ్ లో కాజల్‌ ఆడిపాడనున్నారట.

ఈ సినిమాకు ఎస్ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్ ‘సామజవరగమన’ మంచి హిట్టైంది.  మరో ప్రక్క ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఓవ‌ర్సీస్ హ‌క్కులు రు.8.5 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయని తెలుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios