బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా సుశాంత్ మరణానికి సంబంధించిన వార్తలే కనపడుతున్నాయి. ఈ ఘటన ఆయన అభిమానులను, సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. 

నిజానికి ఆయన కొద్ది రోజుల్లో పెళ్లి వార్తతో మన మందుకు రావాల్సింది. కానీ దురదృష్ట వశాత్తు ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. నవంబర్ లో సుశాంత్ కి పెళ్లి జరగాల్సి ఉందని ఆయన కుటుంబసభ్యులు చెప్పడం గమనార్హం.

అత‌ని వ‌రుస సోద‌రుడు పన్నా సింగ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం సుశాంత్ వివాహానికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. సుశాంత్ కుటుంబానికి సన్నిహింగా ఉన్న‌వారంతా ఈ వివాహానికి రావడానికి సిద్ధమవుతున్నారు. 

కాగా సుశాంత్ ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడ‌నేది వెల్ల‌డికాలేదు. అయితే అత‌ను పెళ్లి చేసుకోవాలనే మూడ్‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌తో అత‌ని క‌టుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. 

కాగాముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుశాంత్ చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. అతను ఆత్మ‌హ‌త్య చేసుకోవడానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. దీనిపై‌ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ముంబయిలోని ఆయన నివాసంలో సుశాంత్ శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.  సీరియల్స్ నుంచి బాలీువడ్ హీరోగా అనతి కాలంలోనే గుర్తింపు సాధించిన సుశాంత్.. ఇలా అర్థాంతరంగా కనుమరుగవ్వడం అందరినీ కలచివేస్తోంది.