అప్పుడు టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్, ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త వినగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉదయ్ కిరణ్ మరణ వార్త గుర్తురాక మానదు. ఇద్దరు హీరోలు కూడా డిప్రెషన్ కి లోనయి మరణించడమే కాకుండా ఇద్దరు కూడా  ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం యాదృచ్చికం. 

Sushant Singh Rajput Suicide Reminds Us Of Tollywood Hero Uday Kiran's Suicide

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వార్త అందరిని శోకసంద్రంలో ముంచేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలుకొని రాజకీయ ప్రముఖులవరకు అందరూ కూడా సుశాంత్ మరణ వార్తపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త వినగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉదయ్ కిరణ్ మరణ వార్త గుర్తురాక మానదు. ఇద్దరు హీరోలు కూడా డిప్రెషన్ కి లోనయి మరణించడమే కాకుండా ఇద్దరు కూడా  ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం యాదృచ్చికం. 

ఈ ఇద్దరు హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎటువంటి  లేకుండా ఎంటర్ అయి తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇద్దరు కూడా మధ్యతరగతికి చెందినవారే. ఇంకో విషయం... ఇద్దరు కూడా చదువుల్లో టాపర్స్.  

ఈ ఇద్దరి మరణాలు.... సినిమా ఇండస్ట్రీలో వారు ఎదుర్కునే సమస్యలు, వారికుండే ప్రెషర్స్, నెక్స్ట్ ఏమిటి అన్న విషయంలో క్లారిటీ లేకపోవడం, ఖరీదైన జీవితాన్ని మైంటైన్ చేయడం అన్ని వెరసి వాళ్ళ జీవితాలు మనకు పైకి కనబడేంత రంగులమయంగా ఉండవనే కఠిన విషయాన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నాయి.   

చిత్రాల్లో అవకాశాలు లేకపోవడం, సొంత ప్రొడక్షన్ లో ట్రై చేసి చేతులు కాల్చుకోవడం, అన్ని వెరసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2003లో చిరంజీవి కూతురితో జరిగిన నిశ్చితార్థం కాన్సల్ అవడంతో ఉదయ్ కిరణ్ మానసికంగా కుంగిపోయాడు. 

ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో కూడా ఆర్ధిక ఇబ్బందులే ప్రధాన కారణం అని తెలియవస్తుంది. హిట్ సినిమాలను అందుకున్నప్పటికీ... అతడి చేతిలో ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏవి లేవు. ప్రొడ్యూసర్లతో అతనిత రిలేషన్స్ చెడిపోయి ఉన్నకారణంగా సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. 

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన సుశాంత్ మానసికంగా కృంగిపోయాడు. గత ఆరునెలలుగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. బాలీవుడ్ వర్గాల్లో కొన్ని నెలలుగా సుశాంత్ కి సంబంధించిన చర్చ నడుస్తుంది. దీనితో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఇద్దరు హీరోలు కూడా 30 నుండి ముప్పయి అయిదు సంవత్సరాల వయసు మధ్యలోనే మరణించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి పెళ్లి కాలేదు అనే ఒక్క విషయంలో తప్పితే... ఇద్దరి మరణాలు కూడా మనకు సినీ వినీలాకాశానికి మరో కోణాన్ని పరిచయం చేస్తాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios