Asianet News Telugu

ఆత్మహత్యకు నాలుగురోజుల ముందు.. అక్కకి సుశాంత్ మెసేజ్

సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి సరిగ్గా నాలుగు రోజుల క్రితం తన సోదరికి కొన్ని మెసేజ్ లు చేశాడు. వాటిని ఇటీవల సుశాంత్ సోదరి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి అభిమానులను మరింతగా హత్తుకుంటున్నాయి. 

Sushant Singh Rajput's sister Shweta Singh Kirti shares childhood memories of actor, reveals conversation they had 4 days before his death
Author
Hyderabad, First Published Jul 28, 2020, 8:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకొని నెలరోజులు కావస్తోంది. అయినా.. సుశాంత్ ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇటీవల సుశాంత్ చివరగా నటించిన ‘దిల్ బేచారే’సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఆయనను అభిమానులు మరింతగా తలుచుకుంటున్నారు.

కాగా.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి సరిగ్గా నాలుగు రోజుల క్రితం తన సోదరికి కొన్ని మెసేజ్ లు చేశాడు. వాటిని ఇటీవల సుశాంత్ సోదరి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి అభిమానులను మరింతగా హత్తుకుంటున్నాయి. ఆ మెసేజ్ లు చూస్తుంటే... సుశాంత్ ఎంత డిప్రెషన్ కి గురయ్యాడో స్పష్టంగా తెలుస్తోంది.

తమ్ముడంటే తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ ప్రతిరోజూ తనను చూడాలనే ఆశతో నిద్ర లేస్తున్నానని బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేత సింగ్‌ కీర్తి ఉద్వేగానికి లోనయ్యారు. త్వరలోనే తనని కలుస్తానని చెప్పాడని.. కానీ అంతలోనే శాశ్వతంగా దూరమయ్యాడంటూ సోదరుడితో తనకున్న జ్ఞాపకాల గురించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

‘‘అమ్మానాన్నలు కొడుకు కావాలని కోరుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి సంతానంగా బాబు జన్మించాడు. అయితే తను ఏడాదిన్నరకే మరణించాడు. దాంతో నిర్వేదంలో మునిగిపోయిన అమ్మానాన్న ఎన్నో, పూజలు, నోములు నోచారు. మళ్లీ కొడుకు పుట్టాలని ప్రార్థనలు చేశారు. రెండేళ్ల తర్వాత దీపావళి రోజున నేను పుట్టాను. నన్ను లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి ఎంతో గారాబంగా పెంచారు. ఆ తర్వాత ఏడాది తమ్ముడు పుట్టాడు. అందమైన చిరునవ్వు, కళ్లల్లో మెరుపులు.. ముద్దు ముద్దుగా ఉండే తన మఖం.. నా తోబట్టువు వచ్చేశాడు. పెద్దక్కగా వాడిని కాచుకుని ఉండటం నా బాధ్యతగా భావించేదాన్ని. ఇద్దరం కలిసి స్కూల్‌కు వెళ్లేవాళ్లం. తను యూకేజీలో ఉన్న సమయంలో అర కిలోమీటరు నడిచి లంచ్‌బ్రేక్‌లో నన్ను చూసేందుకు వచ్చాడు. నాతోనే ఉంటానని మారాం చేశాడు. అప్పుడు టీచర్లకు తెలియకుండా తనని దాచిపెట్టాను’’ అంటూ తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘లవ్‌ యూ బాబూ. నా దగ్గరకు రావొచ్చు కదా’’ అని శ్వేత పేర్కొనగా.. ‘‘అక్కడికి రావాలని మనసు ఉబలాటపడుతోంది అక్కా’’ అని సుశాంత్‌ బదులిచ్చాడు. ఇందుకు స్పందించిన శ్వేత.. ‘‘వచ్చెయ్‌.. ఓ నెలరోజుల పాటు ఇక్కడే ఉండు. బాగుంటుంది’’అని తమ్ముడికి సాంత్వన చేకూర్చారు. ఆత్మహత్యకు సరిగ్గా నాలుగు రోజుల క్రితం సుశాంత్ ఈ మెసేజ్ చేయడం గమనార్హం. చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశాడని.. ఆమె ఆ స్క్రీన్ షార్ట్స్ షేర్ చేసుకున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios