సుశాంత్ చివరి పోస్ట్: తల్లిని మిస్ అవుతూ... మానసిక ఒత్తిడిని బయటపెట్టాడు
సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను గనుక తీసుకుంటే... తన తల్లిని మిస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తల్లి ఫోటో, పక్కన తన ఫోటో ఉంచి మా లవ్ యు అని పోస్ట్ చేసాడు.
బాలీవుడ్ ఆక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సినిమా ఇండస్ట్రీ అంతా భాషలకతీతంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాయి.
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్ని రోజులకింద అతని మాజీ మేనేజర్ కూడా మరణించింది. ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ఆ మరణ వార్త మనస్థాపానికి గురైన సుశాంత్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నాడు.
క్రికెటర్ ఎం ఎస్ ధోని చిత్రంలో ధోని పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్ సింగ్ ఆ సినిమాలో ఆయన ఎంత కష్టం వచ్చిన కూడా దాన్ని ఎదుర్కొని నిలబడే హీరో లాగ మనకు కనబడతాడు. కష్టనష్టాలకోర్చి ఆయన తన కెరీర్ ని నిర్మించుకుంటాడు. కానీ నిజజీవితంలో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు.
సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను గనుక తీసుకుంటే... తన తల్లిని మిస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తల్లి ఫోటో, పక్కన తన ఫోటో ఉంచి మా లవ్ యు అని పోస్ట్ చేసాడు.
మసకగా ఉన్న గతం కన్నీళ్ళుగా ఆవిరైపోతుంటే... వేగంగా సాగిపోతున్న జీవితం లో అంతులేని కలలు చిరునవ్వును చూపెడుతున్నాయి. రెంటితో కుస్తీ పడుతున్నాను అని రాసాడు.
జూన్ మూడవ తేదీన ఈ పోస్ట్య్ పెట్టాడు. జీవితం అగమ్య గోచరంగా ఉంది. నువ్వు లేవు అమ్మ అని ఎమోషనల్ గా ఈ పోస్ట్ పెట్టాడు. ఆ తరువాత తన మాజీ మేనేజర్ కూడా మరణించడంతో సుశాంత్ తీవ్ర డిప్రెషన్ కి లోనయ్యుంటాడని అంటున్నారు.