బాలీవుడ్ నటుడు సుశాంత్ డెత్ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. అసలు సుశాంత్ జీవితంలో ఏం జరిగింది అనే విషయాలపై  రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. సుశాంత్ చనిపోవడానికి కారణం ఎవరు అనే విషయం తెలియకపోయినా.. ఎక్కువగా ఆయన గర్ల్ ఫ్రెండ్ రియాపైనే ఎక్కువగా విమర్శలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలో..  ఈ ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా స్పందించారు. సుశాంత్ మరణం వెనక చాలా విషయాలు జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. సుశాంత్ కుటుంబసభ్యులు, ఫ్యాన్స్.. అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నారని.. దానికి వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. 

ఎన్నో కుట్రలు జరిగాయని.. ఎవరు ఎటువైపు నిలబడతారన్న విషయం చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి.. నిజం తేలాల్సిన అవసరం ఉందని.. అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు.

ఇదిలా ఉండగా... సుశాంత్ మరణించిన వార్త తెలిసిన తర్వా కూడా అనుపమ్ సోషల్ మీడియాలో స్పందించారు. సుశాంత్ మ‌ర‌ణం, ఆయ‌న మ‌ర‌ణంతో సోష‌ల్ మీడియాలో చెల‌రేగుతున్నఊహాగానాలు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌తికూల‌త క‌లిగిస్తాయ‌ని అన్నారు అనుప‌మ్. ప‌రిశ్ర‌మలో మంచి వ్య‌క్తులు ఉన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఎంతో మంది యువ‌త త‌మ క‌ల‌ల‌ని నిజం చేసుకోవ‌డానికి ముంబై వ‌స్తుంటారు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల‌న వారు భ‌య‌ప‌డ‌తారు. యువ‌త త‌మ క‌ల‌ని కొన‌సాగించాలి. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఒంటరిత‌నం ప్ర‌భావితం చేస్తే .. స్నేహితులు, కుటుంబాల‌తో మాట్లాడాల‌ని అనుప‌మ్ ఖేర్ పేర్కొన్నారు. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను కూడా అనుపమ్ వివరించారు.