సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడి హోటల్ బిల్లులు, ప్రయాణ చార్జీలు కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుతే భరించేవాడిని తెలియవస్తుంది. 

బీహార్ పోలీసులు ముంబైలో చేపట్టిన విచారణలో ఈ విషయం తేలింది. బీహార్ పోలీసులు సుశాంత్ డాక్టర్ ని కూడా కలిశారు. 2019 నవంబర్ నుంచి సుశాంత్ కి ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నానని, ఫిబ్రవరి మాసం నుండి సుశాంత్ తిండి సరిగా తినడంలేదని, మందులు కూడా సమయానికి వేసుకోవడంలేదని తెలిపాడు. వైద్యం పరంగా తాను ఇచ్చే సలహాలను కూడా సుశాంత్ పాటించడం మానేశాడని అన్నాడు డాక్టర్. 

సుశాంత్ బ్యాంకు అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా పోలీసులు కూపీ లాగారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడి ఖర్చులను కూడా సుశాంతే భరించేవాడనే విషయం అలానే బయటకు వచ్చింది. 

ఇకపోతే... ఇటీవల సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్, సంచలన ఆరోపణలు చేశాడు. గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పోలీసు కంప్లయింట్ కూడా ఇవ్వటం సంచలనంగా మారింది. 

రియా, సుశాంత్‌ను మానసికంగా వేదించిందని, అతని డబ్బు వాడుకుందని ఆయన కంప్లయింట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సుశాంత్ అనారోగ్యానికి కూడా కారణం రియానే అని, తనని కుటుంబ సభ్యులను కూడా కలవకుండా రియా అడ్డుకుందని కేకే సింగ్ ఆరోపించారు. 

తాజాగా జేడీయూ నేత మహేశ్వర్‌ హజరీ కూడా రియా మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. రియా ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ అని, ఆమె విష కన్యలా వ్యవహరించిందని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. 

అంతేకాదు సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని, దీనిపై పూర్తిగా స్థాయిలో విచారణ జరిపి అసలు దోషులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్‌ కేసులు ముంబై పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందన్న అభిమాప్రాయం వ్యక్తం చేశారు.