బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. తొలుత.. బాలీవుడ్ లోని మూవీ మాఫియా కారణంగా సుశాంత్ కి ఛాన్స్ లు రాలేదని.. ఆ కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ అందరూ భావించారు. అనూహ్యంగా ఇప్పుడు మొత్తం సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి వ్యతిరేకంగా కేసు మలుపు తిరిగింది.

తాజాగా.. సుశాంత్ మరణంపై అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ అకింత లోఖండే సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. 

సినీ పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని అంకిత పేర్కొన్నారు. సుశాంత్ మరీ అంత బలహీనుడు కాదని.. సినిమాల్లో అవకాశాలు రావడంలేదని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె చెప్పారు.

అంతేకాకుండా సుశాంత్ లైవ్లీ పర్సన్ అని.. అతనికి జీవితంలో చాలా చాలా చేయాలని అనుకున్నాడని ఆమె వెల్లడించారు. కాగా.. సుశాంత్ ఒక్కసారిగా ఒంటరివాడు అయిపోయాడని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేమోనని ఆమె భావిస్తున్నట్లు చెప్పారు. తాను సుశాంత్ జీవితంలో ఉండి ఉంటే.. కనీసం.. తాను ఒంటరిగా ఉన్నాడని తెలిసినా.. అతనిని తాను కాపాడుకోగలిగేదానినని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ తో ఉన్నవారు.. అతనిని ఒంటరిగా వదిలేయకుండా ఉండాల్సిందని ఆమె చెప్పారు.

ప్రస్తుతం రియా చక్రవర్తి మీద ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమెను ప్రశ్నించగా.. రియాపై కామెంట్స్ చేయడానికి ఆమె నిరాకరించారు. అయితే.. దర్యాప్తు బాలీవుడ్ లో బంధుప్రీతి కోణంలో కాకుండా సుశాంత్ రిలేషన్స్ గురించి చేస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆమె భావించారు.