సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రాగా… ఒక్కో సోమవారం ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.

తాజాగా సినిమాలో 'సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో' అంటూ సాగే మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఆలపించారు. దక్షిణాది సినిమాలో ఆయన పాడిన తొలిపాట ఇది.

మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుని ఈ మెలోడీని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.  మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేష్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశా లతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నా రు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.