కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన  సూర్య తెలుగులో సక్సెస్ చూసి చాలాకాలమవుతోంది. కోలీవుడ్ లో ఇటీవల వచ్చిన కాప్పాన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ మంచి సక్సెస్ ను అందుకుంది. 100కోట్లకు పైగా వాసులు సాధించిన ఆ సినిమా తెలుగులో మాత్రం అంతగా వసూళ్లు సాధించలేకపోయింది.

అంతకుముందు వచ్చిన NGK కూడా తెలుగులో వర్కౌట్ కాలేదు.  ఏదోలా సొంత భాషలో క్లిక్కయిన సూర్య నెక్స్ట్ సినిమాతో మాత్రం ఇరుభాషలో సక్సెస్ అందుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ సూర్య సుధా కొంగర దర్శకత్వంలో నటించిన సురారై పోట్రు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన ఈ హీరో సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకున్నాడు.  కానీ దర్శకురాలు మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం కావాలని చెప్పడంతో నిర్మాతలు జనవరిలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సూర్య మాత్రం సంక్రాంతికి రావడానికి ఇష్టపడటం లేదు.

పొంగల్ బరిలో తెలుగు తమిళ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఆలస్యమయినప్పటికీ సమ్మర్ లోనే సినిమాను భారిగా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో సినిమాను మంచి హాలిడేస్ టైమ్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ తో చర్చించినట్లు సమాచారం. ఈ సినిమాలో కలెక్షన్స్ కింగ్ మోహన్ పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.