కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ ఫిలిమ్స్ తో తెగ బిజీ అవుతున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటునే వేగంగా ప్రాజెక్టులను ఫినిష్ చేస్తున్నాడు. మొన్న బందోబస్త్ రిలీజ్ కాగానే ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా షూటింగ్ కి వెళ్ళాడు అంటే సూర్య హార్డ్ వర్క్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ టాలెంటెడ్ హీరో నుంచి వస్తున్న చిత్రం సురారై పోట్రు.

ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ సురారై పోట్రు. గురు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక రీసెంట్ గా సినిమా షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా మారింది. యువ సంగీత సంచలనం జీవి ప్రకాష్ కుమార్ తన వర్క్ ని మొదలుపెట్టాడు.

సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఈ రోజే స్టార్ట్ చేశారు. ఓ వైపు నటుడిగా కొనసాగుతున్న జీవి ప్రకాష్ తన మ్యూజిక్ ని ఏ మాత్రం వదలడం లేదు. ఇది జీవికి 70వ చిత్రం కావడం విశేషం. ఏడాదికి 5కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. అలాగే నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక సురారై పోట్రు కి సంబంధించిన టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.