కరోనా లాక్ డౌన్‌ కారణంగా మీడియాకు దూరమైన సినీ తారలు ఇటీవల ఆన్‌లైన్‌ లైవ్‌ ద్వారి మీడియాతో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ  నేపథ్యంలో వాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ సీనియర్ హీరోయిన్‌, హీరో సూర్య  భార్య జ్యోతిక చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆలయాలను అభివృద్ది చేస్తున్నారు. అదే తరహాలో ఆసుపత్రులు, స్కూల్స్‌ కూడా అభివృద్ది చేయాలంటే ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

జ్యోతిక వ్యాఖ్యలు హిందూవుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సమయంలో హీరో సూర్య భార్యకు మద్దతుగా నిలిచాడు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామంటూ మరోసారి చెప్పాడు సూర్య. అంతేకాదు ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు. కొద్ది రోజులు క్రితం జరిగి ఓ అవార్డు వేడుకలో జ్యోతిక ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా ఈ వీడియో ట్రెండింగ్‌లోకి రావటంతో వివాదం చెలరేగింది.

తన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్థావించిన సూర్య `చెట్టు ఊరుకున్నా గాలి వదిలిపెట్టేలా లేదు` అంటూ సోషల్‌ మీడియాను ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. ఆలయాలతో సమానంగా పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ది చెందాలని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద లాంటి వారు కూడా చెప్పారని తెలిపాడు. జ్యోతిక వ్యాఖ్యలను కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డాడు. అయితే ఈ సమయంలో తమకు మద్దతిచ్చిన వారికి సూర్య కృతజ్ఞతలు తెలియజేశాడు.