కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య ఒకప్పుడు తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకునేవారు. సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అతని గత చిత్రాల కలెక్షన్స్ చెబుతాయి. సూర్య ఏ సినిమా చేసిన తమిళ్ తో  పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కావాల్సిందే. చెప్పాలంటే ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో సూర్య కొన్ని సార్లు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.

కానీ గత కొంత కాలంగా సూర్య తమిళ్ లో సక్సెస్ అందుకుంటున్న మాదిరిగా తెలుగులో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సింగం సిరీస్ ల అనంతరం సూర్య చేసిన సినిమాలు అంతగా క్లిక్కవ్వలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన  NGK - బందోబస్త్ సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. ఈ రెండు సినిమాలతో సూర్య తెలుగు మార్కెట్ చాలా తగ్గిపోయిందని కామెంట్స్ వచ్చాయి.

ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని టాలీవుడ్ నెగిటివ్ టాక్ పై సూర్య పగబట్టినట్లు తెలుస్తోంది. మళ్ళీ తెలుగులో తన మార్కెట్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని స్ట్రాంగ్ గా ఫిక్సయిన సూర్య నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అలాగే ఇటీవల కొంత మంది తెలుగు రైటర్స్ తో సూర్య కొన్ని కథలపై డిస్కర్స్ చేసినట్లు సమాచారం.

కుదిరితే త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. ప్రస్తుతం సుధా కొంగర డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సూర్య అనంతరం హరి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాపై ద్రుష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.