సింగం సిరీస్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూనే విభిన్న కథలతో నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలని కూడా సూర్య ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా కెవి ఆనంద్ దర్శత్వంలో సూర్య నటించిన బందోబస్త్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ఆ చిత్రం పరాజయం చెందడంతో సూర్య అభిమానులు నిరాశ చెందారు. 

ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయింది. మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శత్వంలో సూర్య 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రంలలో నటిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులని ఆకట్టుకుంటోంది. డిఫెరెంట్ లుక్ తో సూర్య ఆశ్చర్యపరిచాడు. 

సూర్య గాల్లో ఎగురుతూ కనిపిస్తున్నాడు. నల్లటి బనియన్ ధరించిన గాల్లోకి ఆనందంగా ఎగురుతున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య ఈ లుక్ ని సోషల్ మీడియాలో రివీల్ చేస్తూ.. ఇతను మార.. సామాన్యుడైనప్పటికీ అద్భుతమైన డ్రీమ్ కలిగిన వ్యక్తి' అని కామెంట్ పెట్టాడు. 

సుధా కొంగర ఈ చిత్రాన్ని సామాన్యుడికి సైతం విమాన సౌకర్యాలని కల్పించాలని ఎయిర్ డెక్కన్ సంస్థని ప్రారంభించిన కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. 

సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్  సంగీత దర్శకుడు. మలయాళీ నటి అపర్ణ బాలమురళి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.