తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సూర్య చివరగా నటించిన బందోబస్త్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. సూర్య త్వరలో 'ఆకాశం నీహద్దురా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

విక్టరీ వెంకటేష్ తో బాక్సింగ్ నేపథ్యంలో గురు చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం కల్పించాలని ఎయిర్ డక్కన్ సంస్థని ప్రారంభించిన కెప్టెన్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

విమాన సంస్థని ప్రారంభించాలని కలగనే సామాన్య యువకుడి పాత్రలో సూర్య కనిపిస్తున్నాడు. టీజర్ లో సూర్య ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అతడు చేసిన పోరాటాన్ని చూపిస్తున్నారు. సూర్య ఎమోషనల్ పెర్ఫామెన్స్  ఈ చిత్రంలో హైలైట్ కాబోతోంది. 

క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

'జేబులో 6 వేలు పెట్టుకుని వచ్చి విమానాల కంపెనీ పెడతానని ఒకడొస్తే ఎవడ్రా ఈ వీపీగాడు అని లోకం వాడిని చూసి నవ్వింది' అంటూ సూర్య పాత్రని గురించి చెప్పే డైలాగ్ బావుంది. 'పెద్ద మనుషుల బిజినెస్ నీకెందుకయ్యా.. వెళ్లి మీరు ఊర్లో పందుల్ని మేపుకో' అంటూ సాగే డైలాగులు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి.