ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సౌత్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి విజయం అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వస్తూనే ఉంటాయి. కమర్షియల్ దర్శకుడు హరి కూడా సూర్యతో ఇప్పటికే 5 సినిమాలు చేశాడు.

ఆరు, వెల్, సింగం 1,2, సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో చేరగా సింగం 3 మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆరవసారి వీరి కలయికలో మరో సినిమా తెరకెక్కబోతోంది. సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పాజిటివ్ క్యారెక్టర్ తో పాటు పవర్ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ లో కూడా సూర్య కనిపించబోతున్నాడట.

ప్రస్తుతం సూర్య సుధా కొంగర డైరెక్షన్ లో  ఒక సినిమా చేస్తున్నాడు.ఇకపోతే హరి సినిమాను సొంత బ్యానర్ లోనే నిర్మించాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ హరి హిట్ చూసి చాలా కాలమవుతోంది. చివరగా విక్రమ్ తో తీసిన స్వామి 2 కూడా ప్లాప్ అయ్యింది. మరి చాలా కాలం తరువాత సూర్యతో చేసే ప్రాజెక్ట్ ఈ దర్శకుడికి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.