శివ పుత్రుడు లాంటి వినూత్న సినిమాలతో దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న బాలా ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఓ విధంగా బాలా తో వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదనే చెప్పాలి. ఆర్య - విశాల్ తో వాడు వీడు సినిమా తరువాత బాలా పెద్దగా విజయాల్ని అందుకోలేదు. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని బాలా మరో ప్రయోగానికి సిద్దమవుతున్నాడు.

అథర్వ - ఆర్య కథానాయకులుగా నటిస్తున్న  మల్టీస్టారర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో బాలా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో బాల దర్శకత్వం వహించిన శివపుత్రుడు సినిమాలో సూర్య సపోర్టింగ్ రోల్ లో నటించి కెరీర్ ని ఒక ట్రాక్ లోకి తెచ్చుకున్నాడు. ఆ సినిమాతోనే సూర్య నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.

ఇకపోతే వాడు వీడు సినిమాలో కూడా సూర్య బాలా కోసం గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక చాలా కాలం తరువాత మళ్ళీ బాలా సినిమాలో ఒక డిఫరెంట్ కామియో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కొత్త మల్టీస్టారర్ సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయనున్నారు. అథర్వ ఇంతకుముందు బాలాతో 'పరదేశి' అనే సినిమా చేశాడు.